Recent Posts

సమాజం పట్ల పరిశ్రమల సహకారం ఇలాగే ఉండాలి-కలెక్టర్

నెల్లూరు:  సామాజిక సేవా కార్యక్రమాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పాల్గొనడం అభినందనీయమని జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కృష్ణపట్నం వారు రూ. 15.46 లక్షల విలువచేసే 20 మల్టీ మీటర్,పారామీటర్ పేషెంట్ యూనిట్స్ కొనుగోలుకు సంబంధించి మెగా చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ పరిశ్రమలు,  కంపెనీలు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి కోవిడ్ బాధితులకు అవసరమైన దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన పలు రకాల వైద్య సంబంధ పరికరాలు, సామాగ్రి అందజేశాయన్నారు. ప్రస్తుతం బిపిసిఎల్ వారు కూడా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమల సహకారం  ఇలాగే ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్ఐ డి సి ఈ ఈ విజయ భాస్కర్, డి సి హెచ్ ఎస్ శ్రీమతి ప్రభావతి, బి పి సి ఎల్ ప్రాజెక్టు లీడర్ మురళీధర్ రావు,  అసిస్టెంట్ మేనేజర్ జి.చతురంత్, సేల్స్ అధికారి శ్రీవరుణ్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love