Recent Posts

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి

తిరుపతి: కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి తాజ్ హోటల్ లో నిర్వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందించి ఆహ్వానం పలికారు.

Spread the love
error: Content is protected !!