Recent Posts

4th వేవ్ వచ్చే అవకాశాలు చాలా స్వల్పం-హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

హైదరాబాద్: కరోనా వైరస్ 4th వేవ్ వచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా వున్నయని తెలంగాణ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు..రాష్ట్రంలోనూ 4 నుంచి 6 వారాల్లో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశముందని,, 93 శాతం మందిలో యాంటీబాడీస్ ఉండటం, హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున ఇంతకు ముందులా భారీ వేవ్స్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు..ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14% గా ఉందన్నారు…పౌరులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలన్నారు..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 20 కేసులు మాత్రమే వస్తున్నాయని,, హైదరాబాద్లో 15 కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు..ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తున్నరని తెలిపారు..పెళ్లిళ్లు, ఫంక్షన్లు యధావిధిగా చేసుకోవచ్చని,,ఇదే సమయంలో, పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదన్నారు.. ప్రస్తుతం ఎక్స్ఈ వేరియెంట్ కేసులు ఢిల్లీ, మహారాష్ట్రల్లో మాత్రమే ఉన్నాయని,,అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.. 

Spread the love
error: Content is protected !!