Recent Posts

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుంది-అమిత్ షా

అమరావతి: గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచుకోగా మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం అయితే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు..శుక్రవారం నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తరువాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, అది కేవలం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ సైనిక చర్యవల్లే సాధ్యం అయిందన్నారు..నింజా రాక్షసపాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు(సెప్టెంబర్‌ 17)న విమోన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పట్లో కేసీఆర్‌ డిమాండ్‌ చేశారన్నారు..మరి ఇప్పుడు డిమాండ్‌ ఏమైంది కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు..2024లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖయం..విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్‌షా ప్రకటించారు..మజ్లీస్‌ లాంటి పార్టీలకు బీజేపీ భయపడదని స్పష్టంచేశారు.. కేసిఆర్ పాలనపై తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు..రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు..తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని,,అడ్రసులు గల్లంతైన కాంగ్రెస్‌ కానేకాదన్నారు.తెలంగాణ పగ్గాలు చేపట్టి,రాష్ట్రంను అభివృద్ది బాటలో పరుగులు తీయించే సత్తా,సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందన్నారు..

Spread the love