Recent Posts

కృష్ణా నగర్ లో మా ఎన్నికల రగడ ప్రారంభం

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై రగడ నానాటికి పెరిగిపొతుంది..‘మా’ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌తో మీడియా సమావేశం నిర్వహించడం,,నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ట మసకబారిందని ప్రముఖ నటుడు నాగబాబు వ్యాఖ్యనించడం చర్చనీయాంశంగా మారింది..ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘మా’ ప్యానెల్ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ మీడియా సమావేశం నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడుతూ ‘మా’ ఎన్నికలతోపాటు తాము చేసిన పనుల గురించి చెప్పుకోచ్చారు..నాగబాబు, ప్రకాశ్ రాజ్ లు ఈ విధంగా వ్యాఖ్య నించడం భాధకరమని,, ‘మా’ ప్రతిష్ట మసకబారిందనడం ముమ్మాటికీ ఆవాస్తమన్నారు..లోకల్, నాన్‌ లోకల్ కామెంట్ల పైనా ఘాటుగా స్పందించారు..దేశంలో ఏవరు ఎక్కడైన వుండచ్చని,ముఖ్యంగా సినిమా రంగంలో వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు ఏ ప్రాంతంలో అయిన నటించేందుకు వస్తుంటారని,,అలాంటి వారికి లోకల్,,నాన్ లోకల్  అంటు ట్యాగ్ లు అతికించడం వాఛనీయం కాదన్నారు..‘నేనేంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం లేదని,,నేను సినిమా బిడ్డను,‘మా’ బిడ్డను. సినీ పరిశ్రమకు ఎటువంటి సమస్య వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉండి నిలబడ్డాం.. కాబట్టి నరేశ్ మమ్మల్ని కలుపుకు పోలేదనడం ఎంతవరకు నిజమనేది అందరూ ప్రశ్నించుకోవాలి. ఇక, ‘మా‘ ఎన్నికల విషయానికొస్తే.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు మూడ్నెళ్ల కింద ప్రకాశ్ రాజ్ చెప్పాడు. ‘మా’ రూల్స్ ప్రకారం ఎన్నికల్లో ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయనకు చెప్పడం జరిగింది..మంచు విష్ణు కూడా నన్ను సంప్రదించాడు. ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయనకూ చెప్పను.. ‘మా’ ఓ రాజకీయ వ్యవస్థ కాదు..ఎంతో మంది పెద్దలు ఈ సంస్థను నిర్మించారు.. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్‌‌తో మేము చాలా బాధపడ్డాం..నాగబాబు ‘మా’ మసకబారిందనడం తప్పు.. ‘మా’ మసకబారిందా, ముందుకెళ్లిందా అనేది వాళ్లే తెలుసుకోవాలి.. ఇప్పటికీ ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనే కోరుకుంటున్నమన్నారు..

Spread the love