Recent Posts

రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలి-అంబటి కృష్ణారెడ్డి

జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం..

నెల్లూరు: రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, రైతు బాగా వుండాలన్న సంకల్పంతో సీ.ఎం వ్యవసాయ సలహా మండళ్ళను  ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి  ఆకాంక్షకు అనుగుణంగా రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణా రెడ్డి పేర్కొన్నారు..శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి  అధ్యక్షతన జిల్లా  వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది.ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు  వ్యవసాయ సలహా మండలిలో చర్చించి వారికి మేలు జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రలను  ఏర్పాటు చేయడంతో పాటు  రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు విస్తృతమైన  సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో రైతులకు  అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు,  వ్యవసాయ యంత్ర పరికరాలను గుర్తించి   ముందుగానే ప్రణాళికా బద్ధంగా ప్రతిపాదనలు పంపినట్లైతే  దానికనుగుణంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 2023 సంవత్సరం నాటికి  రాష్ట్రంలో చేపట్టిన అన్నీ రైతు భరోసా కేంద్రాలు, గోడౌన్లు పూర్తి కావడం జరుగుతుందని,  గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన  విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు,  వ్యవసాయ యంత్ర పరికరాల నిల్వ సామర్ధ్యం   పెరగడంతో పాటు రైతుల అవసరాలు పూర్తి స్థాయిలో నెరవేరుతుందని రెడ్డి వివరించారు..

జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) హరెంధిర ప్రసాద్, జిల్లాలో వ్యవసాయం,,దాని అనుబంధ రంగాల అభివృద్దికి  చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్.బి.కె  స్థాయిలోను, రెండవ శుక్రవారం మండల స్థాయిలో  వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి, ఆ సమావేశాల్లో వచ్చే సూచనలు, సలహాలను జిల్లా  వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం, అవసరమైతే ప్రభుత్వంనకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 680  రైతు భరోసా కేంద్రాలల్లో కష్టమ్ హైరింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించినదని, ఇప్పటి వరకు జిల్లాలో 246 గ్రూపులకు 1494.5 లక్షల రూపాయల విలువ గల 2090 వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసి, 417 లక్షల రూపాయల సబ్సిడీ గా  రైతు గ్రూపు ల అకౌంట్ లకు జమ చేయడమైనది జాయింట్ కలెక్టర్ వివరించారు..జిల్లాలో  76,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా  అధికంగా 94,460 మెట్రిక్ టన్నుల  యూరియా జిల్లాకు రావడం జరిగిందని, ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని జాయింట్ కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒక  ప్రణాళికా బద్దంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.జిల్లా  వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love
error: Content is protected !!