Recent Posts

నడిరోడ్డుపై డాక్టర్లను కాల్చి చంపిన దుండగుడు

అమరావతి: రాజస్తాన్ లో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు..నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారులో వున్న డాక్టర్‌ దంపతులను దుండగుడు కాల్చి చంపారు..భరత్‌పూర్‌ కి చెందిన డాక్టర్.సుదీప్‌ గుప్తా, ఆయన భార్య సీమా గుప్తా కూడా డాక్టరే..సంఘటన నేపథ్యం…కారులో వెళ్లుతున్న డాక్టర్ల దంపతులను,,ఇద్దరు వ్యక్తులు బైక్‌ పై వచ్చి కారుకు అడ్డంగా బైక్ ను అపివేశారు..వారు ఎవరో తెలుసుకునేందుకు సందీప్‌ కారు అద్దాన్ని దించాడు..బైక్ వచ్చిన వారిలో ఒక వ్యక్తి తనతో తెచ్చుకున్న తుపాకీతో దంపతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు..డాక్టర్ దంపతులు చనిపోయారని నిర్ధారించుకున్నాక నిందితులు బైక్ పై పారిపోయారు..కాల్పుల దృశ్యాలు స్థానికంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి..సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.. గంటల వ్యవధిలోనే కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించారు.. ప్రతీకారంతోనే సుదీప్‌ దంపతుల హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు.. 2019లో డాక్టర్లు ఓ మహిళ హత్య కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు..చనిపోయిన మహిళతో డాక్టరు సందీప్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు అప్పుడు పోలీసులు జరిపిన విచారణలో తేలింది..హత్యకు గురికాబడిన మహిళ సోదరుడే ఇప్పుడు సుదీప్ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు..

Spread the love