Recent Posts

ఉగ్ర సంస్థ టాప్ కమోండర్ ను హతమర్చిన సైన్యం

అమరావతి: జమ్మూకశ్మీర్ లో భారత ఆర్మీ,స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఏరివేత కార్యక్రమంలో ఉగ్ర సంస్థ జై షే మొహమ్మద్ కు చెందిన టాప్ కమాండర్ షమ్ సోఫీని బలగాలు కాల్చి చంపాయి.ఈ విషయాన్ని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ లో షమ్ సోఫీని బలగాలు హతమార్చాయని చెప్పారు.ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు ఇటీవలే సరిహద్దులను దాటి భారత్ లో అడుగుపెట్టి,ఐదుగురు సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు..ఇందులో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు..సైన్యం ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్నిముమ్మరం చేసింది..

Spread the love