Recent Posts

మహిళల అభ్యున్నతి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది-కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు: మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.మంగళవారం రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఆసరా రెండో విడత సంబరాల  కార్యక్రమంలో  వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డితో కలిసి కలెక్టర్  పాల్గొన్నసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నారు. ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ రాపూరులో ఎప్పుడు వర్షం పడదని, అలాంటిది ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే వర్షం పడడం శుభసూచకమన్నారు.సీ.ఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పొదుపు గ్రూపు మహిళలకు రుణాలను మాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.నాలుగు విడతల్లో రుణమాఫీ నగదును ప్రభుత్వం జమ చేయనుందని, ఈ క్రమంలో మొదటి విడత వైయస్సార్ ఆసరా రుణమాఫీ నగదును గత ఏడాది జమ చేయగా, ప్రస్తుతం రెండో విడత ఆసరా నగదును అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు వివరించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం అగ్రతాంబూలం వేస్తుందని, ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.అనంతరంవైయస్సార్ ఆసరా రెండో విడత నగదును 757 పొదుపు సంఘాలకు సంబంధించి 4.96 కోట్ల రూపాయల మెగా బ్యాంకు చెక్కును పొదుపు మహిళలకు అందించారు.

Spread the love