Recent Posts

తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలి,అప్పుడే వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది-దియాకుమారి

అమరావతి: ఆగ్రాలో తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమ రాజ కుటుంబానికి చెందినదని,,రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియాకుమారి అన్నారు.. ప్రస్తుతం ఉన్న తాజ్ మహల్ స్థలం, జైపూర్ రాజ కుటుంబానికి చెందిన అప్పటి జైపూర్ పాలకుడు జై సింగ్ ది అని,, షాజహాన్ ఆ ప్రాంతాన్ని పరిపాలించడం వలన ఆ భూమిని తీసుకున్నారని చెప్పారు.. అప్పట్లో భూమిని తీసుకున్నందుకు కొంత పరిహారం కూడా ఇచ్చారని,,దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని,,కోర్టు ఆదేశిస్తే సదరు రికార్డ్స్ ను సమర్పిస్తామని తెలిపారు..ఆ కాలంలో కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని,,ఒకవేళ తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే,,అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు..అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను ఎం.పీ సమర్థించారు..తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలని,,అప్పుడే వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుందని,, తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉందన్నారు.

Spread the love
error: Content is protected !!