Recent Posts

గంగూభాయ్‌ కతియావాడి చిత్రం విడుదల తేదిని మార్చినందుకు ధన్యవాదలు-రాజమౌళి

అమరావతి: కరోనా వైరస్ తీవ్రత కొంత మేర తగ్గి పరిస్థితులు చక్కపడుతుండడంతో,తెలుగు సినిమా పరిశ్రమ భారీ బడ్జెట్ చిత్రాలను థియేటర్లల్లో విడుదల చేసేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. 2022 సంక్రాంతి సీజన్‌లో పెద్ద చిత్రాలు పోటీ రిలీజ్ కు పోటీ పడుతున్నాయి..జనవరి 7వ తేదిన RRR చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది..ఇదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌ లీలాభన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయ్‌ కతియావాడి చిత్రాన్ని జనవరి 6వ తేదిన విడుదల చేస్తున్నట్లు అయన ప్రకటించారు..ఒకే సారి ప్యాన్‌ ఇండియా చిత్రాలు అయిన RRR & గంగూభాయ్‌ కతియావాడి  క్లాష్‌ అయ్యే ఆవకాశం ఏర్పడింది..దింతో భన్సాలీ యూనిట్ విడుదల తేదినీ మార్చారు..ఈ మేరకు పెన్‌ స్డూడియో సంస్థ ఓ ప్రకటన విడుదల చేస్తు,,గంగూభాయ్‌ కతియావాడి  చిత్రం విడుదలను ఫిబ్రవరి 18వ తేదికి మార్చిన్నట్లు  ప్రకటనలో పేర్కొన్నారు..ఈ రెండు చిత్రాల్లో ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రధారులు..ఈ సందర్భంగా రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తు,,విడుదల తేదీని మార్చాలని జయంతీలాల్‌ గడ,, సంజయ్‌ లీలా భన్సాలీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. గంగుబాయి కతియావాడికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!