Recent Posts

రాష్ట్రంలో టెన్త్,ఇంటర్ పరీక్షలు రద్దు-మంత్రి సురేష్

అమరావతి: విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యిలో వుంచుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు..సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు..పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందని,,అయితే సుప్రీకోర్టు సూచనల ప్రకారం వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని తెలిపారు..అధికారులతో సాధ్యసాధ్యలపై చర్చించిన అనంతరం పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు జరిగిందన్నారు..ఇంటర్,,పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.. మార్కుల అసెస్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపై హైపవర్ కమిటీని నియమించామన్నారు..ఇప్పటికి తాము పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగానే ఉన్నమని,, ఇదే విషయాన్ని అఫిడవిట్‌లోనూ చెప్పమన్నారు..కానీ, సుప్రీం కోర్టు విధించిన డెడ్ లైన్ లోపల పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని, అందుకే పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు మంత్రి తెలిపారు..

Spread the love