Recent Posts

శ్రీశైల దేవస్థానంలో గురువారం నుంచి ఆలయ దర్శన వేళలు మార్పు

అమరావతి: దక్షణ కాశీగా ప్రసిద్దిగాంచిన శ్రీశైల దేవస్థానంలో గురువారం నుంచి ఆలయ దర్శన వేళలు మార్పు చేయడం జరిగిందని దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.. నేటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నమని,,గురువారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం కర్యూ ఆంక్షలు సడలించిన నేపధ్యంలో భక్తుల కోసం శ్రీశైల దర్శన వేళల్లో మార్పు చేసినట్లు పేర్కొన్నారు.. రాత్రి 8 వరకు భక్తులకు దర్శానాలకు ఆలయంలోకి అనుమతించడం జరుగుతుందని, రాత్రి 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుందని ఈవో వివరించారు..స్వామి అమ్మవారల ఆలయ ద్వారాలు తెరచినప్పటి నుంచి రాత్రి ఆలయ ద్వారాలు మూసేంత వరకు రోజువారిగా జరిగే ఆలయ కైంకర్యాలన్నీ యధావిధిగా జరుగుతాయని, అర్చక స్వాములు ఈ కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తారని తెలిపారు..ఆలయ దర్శన వేళలు మార్పు చేసినప్పటికీ ఆన్ లైన్ ద్వారా నిర్వహించే పరోక్ష సేవలు యధావిధిగా కొనసాగుతాయని,, దర్శనానికి నేరుగా వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలియచేశారు..

Spread the love