Recent Posts

అమెజాన్ ప్రైమ్ ఆశలపై నీళ్లు చల్లిన తెలుగు నిర్మాతలు

హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో సినిమా హళ్లు మూతపడటంతో OTT ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభించింది..అయితే తెలుగులో ఒక్క aha OTT సంస్థ మాత్రమే కొద్దొ గొప్పొ తెలుగు చిత్రలను ప్రదర్శిస్తుంది..అమెజాన్ ప్రైమ్ 2020 కరోనా సమయంలో తెలుగు చిత్రాల మార్కెట్ ను కాప్చర్ చేయాలని భావించింది..ఇందుకు అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ OTT కోసం తీసుకుని విడుదల చేసింది..అయితే ఆశించిన స్థాయిలో వాటికి లాభలు రాలేదని సినివర్గాల భోగట్టా..ఈ సంవత్సరం థియేటర్లు మూత పడిన సందర్భంగానూ మరోసారి అమెజాన్ ప్రైమ్ తెలుగు నిర్మాతలు తమకు సినిమాలను తమ OTT ద్వారా విడుదల చేస్తారని అమెజాన్ భావించింది..ఇందుకు విరుద్దంగా పెద్ద చిత్రాల నిర్మాతలంతా ఆలస్యమైన థియేటర్లలోనే తమ చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..దింతో అమెజాన్ ప్రైమ్ ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్టు అయ్యింది..పోని చిన్న చిత్రాల నిర్మాతలు అయిన వారి చిత్రాలను తమ ద్వారా విడుదల చేస్తారని భావిస్తే,,వాళ్లు భారీ మొత్తాలను ఆశిస్తూ, అమెజాన్ ప్రైమ్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం..అంత మొత్తం ఇచ్చి చిన్న చిత్రాలను విడుదల చేస్తే,,వాటికి వచ్చే రెవెన్యూ పెద్దగా వర్క్ అవుట్ కాదని గ్రహించిన అమెజాన్ ప్రైమ్ వాటిని తీసుకునే విషయంలో నిర్లిప్తతను ప్రదర్శించిందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు..ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ స్ట్రయిట్ తెలుగు సినిమా అంటే ‘పచ్చీస్’ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది..ఈ సినిమాకి అంతంత మాత్రమే రెస్పాన్స్ వచ్చింది..ఈ సారి కూడా ఒక్క పెద్ద చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాలేదు..తెలుగులో చిన్న చిత్రాల నిర్మాతలు అత్యాశకు పోతున్నారని, పెద్ద చిత్రాల నిర్మాతలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని అమెజాన్ వర్గాలు రుసరుసలాడున్నట్టు సమాచారం..అయితే ఇదే సమయంలో ఆహా సంస్థ స్ట్రయిట్ తెలుగు చిన్న సినిమాలను, అనువాద చిత్రాలను విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులు అభిమానం సంపాదించుకుంటు వేగంగా మార్కెట్ పై తన పట్టును పెంచుకుంటుంది..

Spread the love