Recent Posts

హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు టెలీ సేవలు- అనిల్ కుమార్ సింఘాల్

ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదు..

అమరావతి: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులతో సలహాలు సూచనలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో కరోనా టెస్టులు చేయడంతో పాటు అక్కడే ఫలితాలు కూడా ఇవ్వనున్నామన్నారు. కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకే అప్పగించినట్లు ఆయన తెలిపారు..మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 98,214 కరోనా టెస్టులు నిర్వహించగా, 19,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మరణాలు సంభవించాయని తెలిపారు. నిన్నా మొన్నటి కన్నా ఆక్సిజన్ ఎక్కుగా సరఫరా:-నిన్నా మొన్నటి కన్నా నేడు ఎక్కువగా ఆక్సిజన్ ను సరఫరా చేశామని ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆస్సిజన్ సప్లయ్ చేశామన్నారు.హోం ఐసోలేషన్ బాధితులకు టెలీ సేవలు:-టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ కు 2,668 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారి ద్వారా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా  ఫోన్ లో సలహాలు సూచనలు అందజేశామన్నారు. హోం ఐసోలేషన్ లో 88,898 మంది ఉన్నారని, వారందరికీ ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతో పాటు సలహాలు సూచనలు అందిజేసే కార్యక్రమం నేటి సాయంత్రం(శనివారం) నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఒకవైపు ఎన్ఎఎం.లు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి వెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తారన్నారు. మరో వైపు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా డాక్టర్లు నేరుగా కరోనా బాధితులకు ఫోన్ చేసి సలహాలు సూచనలు అందజేస్తారన్నారు..వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే:-జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని ఆయన తెలిపారు..అవసరమైన వారికే బెడ్లు:-రాష్ట్రంలో 551 ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని, వాటిలో బెడ్లు 43,498 ఉన్నాయన్నాని తెలిపారు. వాటిలో నేటి(శనివారం) ఉదయం వరకూ 32,301 బెడ్లు నిండాయన్నారు. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో ఉంటే రక్షణ ఉంటుందనే ఆలోచనతో ఆసుపత్రుల్లో చేరడానికే కరోనా బాధితులు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు..కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కొవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చు…లేకుంటే ఇంటికే నేరుగా వెళ్లొచ్చునన్నారు..కొవిడ్ కేర్ సెంట్లలోనే టెస్టింగ్, ఫలితం వెల్లడి:-రెండు మూడు రోజుల్లో కొవిడ్ కేర్ సెంట్లలోనే టెస్టింగ్ చేసి, అక్కడే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లో ఫలితాలు ఇస్తున్నారన్నారు. కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల సమయం పడుతోందన్నారు. రాష్ట్రమంతటా మంగళవారం నుంచి టెస్టులు చేసిన తరవాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు..ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదు:-రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ లు ఆపలేదన్నాని ఆయన తెలిపారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న శాంపిళ్లను రెండ్రోజుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ర్యాపిట్ టెస్టుల చేస్తున్నారన్నారు. అంబులెన్స్ లు కొరత ఉన్న చోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చామన్నారు. 

Spread the love