Recent Posts

తెలంగాణ బొగ్గు నిల్వలు వున్నాయి,ఏపి,కర్ణాటక,మహారాష్ట్రలకు బొగ్గు పంపండి-కేంద్రం

అమరావతి: విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వ‌లు లేకపోవడంతో,విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌కు అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని,అలాంటి పరిస్థితి ఏర్పాడితే విద్యుత్ సంక్షోభం తీవ్రంగా వుంటుందని రాష్ట్రాలు కేంద్రంకు లేఖలు రాయడం,అందుకు కేంద్ర మంత్రి తిరిగి లేఖ రాస్తు,అలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని తెలిపారు..బొగ్గు నిల్వలపై మంగళవారం ప్ర‌ధానమంత్రి నేతృత్వంలో స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.. సమావేశంలో దేశంలోని బొగ్గు నిల్వ‌ల‌పై కేంద్రం ఆరా తీసింది..ఇందులో భాగంగానే తెలంగాణ‌లో బొగ్గు నిల్వ‌ల‌పై కేంద్రం దృష్టి పెట్టింది..దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు పనిచేస్తున్నయి,వీటికి  బొగ్గుగ‌నులు ఎంత ఉన్నాయి,ఎంతెంత బొగ్గు అవ‌స‌రం అవుతుందనే విష‌యాల‌పై కేంద్రం దృష్టి సారించింది..116 లో కేవ‌లం 4 ఉత్పత్తి కేంద్రాల్లోనే 13 రోజుల‌పాటు క‌రెంట్ ఉత్ప‌త్తికి కావాల్సిన బొగ్గునిల్వ‌లు ఉన్నాయ‌ని కేంద్రం గుర్తించింది.తెలంగాణ‌లోని భూపాల‌ప‌ల్లి విద్యుత్ కేంద్రంలో 15 రోజ‌ల విద్యుత్ ఉత్ప‌త్తికి స‌రిప‌డా బొగ్గునిల్వ‌లు ఉన్నా,,ఇంకా అద‌నంగా అక్క‌డికి బొగ్గు ఎందుకు పంపుతున్నార‌ని సింగ‌రేణిని కేంద్రం ప్ర‌శ్నించింది..బొగ్గు కొర‌త తీవ్రంగా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్,క‌ర్ణాట‌క‌,మ‌హారాష్ట్ర విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గును స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.  

Spread the love