Recent Posts

టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల విలువ రూ.791 కోట్లు-మంత్రి.అవంతి

విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడిందని,,ఏమ్మెల్యే గా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారని క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు…ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నమని,,చంద్రబాబు తన హయంలో పెద్ద భూకుంభకోణానికి నాంది పలికాడని,,అయనని చూపిన బాటలోనే పల్లా శ్రీనివాస్ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పారు..మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచిందని,,మా హయాంలో మా నాయకులు ఎవ్వరు భూకబ్జా లకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు..టీడీపీ నేతలు తప్పు చేసి,,మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు..విశాఖ లో పల్లా శ్రీనివాసరావు,,అయన కుటుంబ సభ్యులు దిగజారి భూములు అక్రమించుకున్నారు అని తెలిపారు..భూముల విలువ 791కోట్లు:- టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు,తుంగ్లాం,,కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చి వేస్తున్నారు..సర్వే నంబర్ 29/1 లో ఉన్న భూమి ఐదెకరాల 42 సెంట్లు భూమిలో ప్రహరీగోడలు తొలగించారు..ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 49.4 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు..  ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విలువ 791కోట్లుగా నిర్ధారణ అయ్యింది..ప్రస్తుతం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్,విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు..

Spread the love