Recent Posts

ఎయిర్‌ ఇండియా సంస్థ కొనుగోలు బిడ్ దాఖలు చేసిన టాటా గ్రూప్

అమరావతి: పీకలోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ కావడంతో,మాతృసంస్థ అయిన టాటా గ్రూప్ మినహా మరే సంస్థ బిడ్ దాఖలు చేయలేదు..గడువు తేదీని పొడిగించే ప్రసక్తి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంగా ప్రకటించి వున్నారు..ఈ నేపధ్యంలో టాటా గ్రూప్‌ ఒక్కటే ఎయిర్‌ ఇండియా కోసం బిడ్‌ దాఖలు చేయడంతో ఎలాంటి పోటీ లేకుండా టాటా గ్రూప్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.. స్పైస్ జెట్ కూడా రంగంలో నిలుస్తుందని భావించినా బిడ్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు దాదాపు  43వేల కోట్ల రూపాయల అప్పులుండగా, అందులో  22 వేల కోట్లను ఎయిర్‌ ఇండియా అసెంట్ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ చేశారు.అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు ఎయిర్‌ ఇండియాతో పాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా వంద శాతం వాటా అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఎయిర్‌ ఇండియా భవనం, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్‌ హౌస్‌ కూడా అమ్మివేసేందుకు నిర్ణయం తీసుకుంది..టాటా గ్రూప్ చేతుల్లోకి ఎయిర్ ఇండియా వెళ్లినట్లయితే,సంస్థకు మంచి భవిష్యత్ వుంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచవేస్తున్నారు..

Spread the love