Recent Posts

పొదలకూరు చక్కెర కర్మాగారం రైతుల బకాయిలు చెల్లింపులకు చర్యలు చేపట్టండి-కలెక్టర్

నెల్లూరు:  పొదలకూరు చక్కెర కర్మాగారం నుంచి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో చెరకు రైతుల బకాయిలపై సమీక్షించారు.ఈ సందర్భంగా  2018-19 సంవత్సరానికి గాను 774 మంది రైతులకు చెల్లించాల్సిన 24 కోట్ల రూపాయల్లో 14 కోట్లు చెల్లించగా ఇంకా సుమారు 10 కోట్ల మేర రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని సహాయ కమిషనర్ జాన్ విక్టర్ కలెక్టర్ కు వివరించారు.ఈ సమావేశంలో జె.సి హరేంధిర ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్ రెడ్డి, రైతులు సుధాకర్ రెడ్డి, హరి సర్వోత్తమ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!