తిరుపతి: ఈ వారంలో వరుస సెలవు రోజులు రావడంతో తిరుమల గిరులు శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతోంది.. టీటీడీ,,మూడు రోజులుగా టికెట్ లేకుండానే శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తోంది..దీంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు..భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది..కరోనా కారణంగా రెండు సంవత్సరాల తరువాత, తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది..గురువారం ఒక్క రోజే 82 వేల 722 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా,, మొత్తం రూ.5 కోట్ల 11 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..ఇదే సమయంలో తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి..రెండో రోజు తిరుమాడ వీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమాడ వీధులలో స్వర్ణరథోత్సవం
