Recent Posts

హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి  సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్: హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి  సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది..గురువారం వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది..ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది..ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.నిమజ్జనం అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పును జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తు పిటిషన్‌ దాఖలు చేసింది.జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు..ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని,, విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని సోలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఉత్తర్వులను అమలు చేస్తామని తుషార్ మెహతా ధర్మాసనంకు తెలిపారు.ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని వివరించారు..హైదరాబాద్‌ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే అన్నారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుంద‌రీక‌ర‌ణ‌కు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు.ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.ఇందుకు సోలిసలిటర్ జనరల్ సమాధానం తెలియచేస్తు, 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపారు..

Spread the love