Recent Posts

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టి వేసిన సుప్రీంకోర్టు

అమరావతి: అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం తరఫున వాదించిన దుష్యంత్ దవే,వాదనలు వినిపించారు. ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం- 55 ప్రకారం ఇది నేరపూరితమని,ఈ కేసు ప్రాధమిక విచారణ దశలో ఉండగానే ఏపీ హైకోర్టు అడ్డుకుంది కాబట్టి ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు కొట్టేయాలని కోరారు.ఈ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలున్నాయని,భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో అనేక లోటుపాట్లున్నాయి కాబట్టి ఈ కేసును ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టానికి అనుగుణంగా విచారణ చేయించాల్సి ఉందని వాదించారు..ఈ అంశంపై ప్రతివాద న్యాయవాదులు సైతం అంతే స్థాయిలో తీవ్రంగా విబేధించారు. 2014 అక్టోబర్ నుంచే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో మీడియాలో వచ్చిందని, కృష్ణా – గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు 2014 డిసెంబర్ 30న ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైందని ప్రతివాద న్యాయవాది ఖుర్షిద్ తర వాదనలు విన్పించారు..రాజధాని వ్యవహారమంతా బహిరంగంగానే జరిగింది కాబట్టి ఇందులో ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టానికి తావు లేదన్నదన్నారు..రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించిందని,ఆ తరువాతే తీర్పునిచ్చిందని మరో ప్రతివాద న్యావాది శ్యామ్ దివాన్ కోర్టుకు తెలిపారు..  స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఇక్కడ ఆసలు సమస్యే లేదని అన్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న జస్టిస్ వినిత్ శరణ్,జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేసి,ప్రభుత్వ పిటిషన్ కొట్టేసింది..

Spread the love