Recent Posts

నీట్ ఫలితాల ప్రకటనకు సుప్రీమ్ కోర్టు అనుమతి

అమరావతి: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (NEET) యూజీ 2021 ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..గతంలో నీట్ యూజీ ఫలితాలను ప్రకటించవద్దంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై L Nageswara Rao, Sanjiv Khanna and B. R Gavai న్యాయమూర్తులను కూడిన సుప్రీమ్ కోర్టు బెంచ్ స్టే విధిస్తు,ఫలితాలను ప్రకటించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని అదేశించింది.సెప్టంబరు 12వ తేది జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మహరాష్ట్రంలో పరీక్షకు హాజరైన ఇద్దరు విద్యార్దుల టెస్టు బుక్ లెట్,ఓఎంఆర్ షీట్లు పరీక్ష కేంద్రంలో తారుమారు అయ్యాయి.దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.దినిపై న్యాయస్థానం ఫలితాలపై స్టే విధించింది.ఇద్దరు విద్యార్దులకు మళ్లీ పరీక్షలు నిర్వహించి తరువాతనే ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది.దీనిపై NTA సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది.ఫలితాలను ప్రకటన ఆలస్యం అయితే వైద్యవిద్యలో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయస్థానంకు తెలిపింది. NTA పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం,బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తు,ఫలితాలకు కోసం దాదాపు 16 లక్షల మంది విద్యార్దులు ఎదురు చూస్తున్నరని,ఇద్దరి కోసం ఫలితాలను అపలేమని,అందుకే బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. ఇద్దరు విద్యార్దుల సమస్యను త్వరలోనే పరిశీలిస్తామని,దీనిపై తదుపరి విచారణను నవంబరు 12వ తేదికి వాయిదా వేసింది.అక్టోబరు 30వ తేదిన NEET ఫలితాలు వెలువడే ఆవకాశం వుంది.

Spread the love
error: Content is protected !!