Recent Posts

ఎం.పీ బండి.సంజయ్ పై దాడి కేసులో తెలంగా డీజీపీ,సి.ఎస్ లకు సమన్లు

హైదరాబాద్: బీజెపీ తెలంగాణ అధ్యక్షుడు,ఎం.పీ బండి సంజయ్‌ 317 జీఓను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో, పోలీసులు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన సంగతి విదితమే..దీనిపై బండి సంజయ్‌ పార్లమెంట్ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్‌ కమిటీ సమన్లు జారీ చేసింది..పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి బండి సంజయ్‌ను అరెస్టు చేయడంపై ప్రవిలేజ్‌ కమిటీ సీరీయస్‌ అయింది..ఎం.పీపై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ,,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారాయణ సహా బాధ్యులైన ఇతర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది..ఫిబ్రవరి 3వ తేదిన ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్,  ఆదేశాలు జారీ చేశారు..

Spread the love
error: Content is protected !!