Recent Posts

ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్ష నిర్వహించాలంటు,హైకోర్టును ఆశ్రయింన విద్యార్దులు

హైదరాబాద్: భవిష్యత్ లో ఉన్నత చదువులు చదవాలన్న,,మంచి కంపెనీలో ఉద్యోగం పొందాలన్న ఇంటర్ మార్కులను బెంచ్ మార్క్ గా తీసుకుంటారని,ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,పరీక్ష నిర్వహించాలంటు 10 మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయించారు.ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని,ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ మార్కులే ప్రస్తుతం ఇవ్వడంతో సమస్యలు వస్తాయని విద్యార్థులు తెలిపారు..ఇయర్ లో ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో ప్రణళిక బద్దంగా సిద్దమైయ్యమన్నారు..అలాగే విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదువాలంటే, ఇంటర్‌లో కనీసం 50% మార్కులు ఉండాలనే నిబంధన ఉందన్నారు..ఈ లాంటి సమస్య తలైతడంతో పరీక్షలు నిర్వహించకుంటే,,తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు..తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చిందని, ప్రస్తుతం విద్యార్థుల విజ్ఞప్తితో నోటిఫికేషన్‌ జారీచేసి కోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలనే యోచనలో ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నట్టు సమాచారం..దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలుస్తోంది..

 

Spread the love