ఫిబ్రవరి 7 నుంచి…
అమరావతి: ఇది చాలా బాధాకరమైన రోజు…వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం,, అధికారుల కమిటీ మాటలనే పరిగిణంలోకి తీసుకున్నదని సాధన సమితి నాయకులు అన్నారు. సోమవారం పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్కు సమ్మె నోటీసు అందజేశారు..అనంతరం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని,,ఈ నెల పాత జీతాలనే ఇవ్వండి అని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు..ఇది ఆషామాషీ వ్యవహారం కాదని,,కమిటీ అధికార పరిధి ఏంటో తెలియకుండా చర్చలకు హాజరుకాలేం అని చెప్పామన్నారు.. ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ జీఓ కాపీ మాకు ఇచ్చారని తెలిపారు..ఫిబ్రవరి 6వ తేది ఆర్దరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ వర్గాలు మొత్తంగా సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు..