Recent Posts

కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు-కేంద్రం ఇచ్చే నిధులతోనే నాడు-నేడు-సోము

ఈ సభ ద్వారా అందరికీ ఏం చూపించాలో..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఇచ్చే నిధులతోనే నాడు-నేడు అని అమలు చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్యను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, కానీ జగన్ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఏ.పి బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రంగా విమర్శించారు.. మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన భాజపా ప్రజాగ్రహ సభలో అధికార వైకాపా ప్రభుత్వంపై భారతీయ జనతాపార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు..సభలో సీఎం జగన్ ప్రభుత్వ​ వైఫల్యాలను ఎండగడుతూ,రాష్ట్రంలో ఆమలు జరుగుతున్న పలు పథకాల తీరును ప్రజలకు వివరించారు..భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు.. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని,,కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని ఎద్దేవా చేశారు..ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అంటూ ప్రశ్నించారు.. అలాగే మా సభను చూసి చాలామంది ఇబ్బంది,,భయపడుతున్నారని,,జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అన్నారు..తెదేపా, వైకాపా ప్రభుత్వాలు,,రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని దుయ్యబట్టారు.ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలని, ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్నది తమ పార్టీనే అన్నారు..యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే.. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు..కమ్యూనిస్టు పార్టీలని విరుచుకు పడ్డారు..కేంద్రం డబ్బిస్తే గ్రామ సచివాలయాలు కట్టి స్తోత్రం.. స్తోత్రం అంటూ జగనన్న జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని.. మంత్రి పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రజాగ్రహ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని.. ఈ సభ ద్వారా అందరికీ ఏం చూపించాలో.. అంతా చూపిస్తామన్నారు.వైసీపీ, టీడీపీ నేతలు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో అన్నీ తేలుస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు..

Spread the love
error: Content is protected !!