Recent Posts

క్రీడలు జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి-ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అమరావతి: క్రీడలు దేహ దారుఢ్యానికి దోహదపడటమే కాకుండా జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని,,ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు..ఆదివారం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కంఠీరవ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి..కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ 10 రోజులపాటు జరిగే ఈ గేమ్స్ లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి క్రీడాకారులు రానున్నారని తెలిపారు..మొత్తం 20 క్రీడా విభాగాల్లో 257 బంగారు పతకాల కోసం ఆటగాళ్లు పోటీ పడనున్నట్లు తెలిపారు..మల్లంఖాంబ్, యోగాసన్ వంటి ప్రాచీన భారతీయ క్రీడలను ఈ గేమ్స్ లో చేర్చినట్లు పేర్కొన్నారు..‘జీరో వేస్ట్, జీరో ప్లాస్టిక్’ నినాదంతో ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ డ్రీమ్ అయిన ఈ క్రీడలు,,మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయని చెప్పారు..టోర్నీ ప్రారంభోత్సవంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై,,రాష్ట క్రీడా మంత్రి నిసిత్ ప్రతీక్, మాజీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love
error: Content is protected !!