AMARAVATHI

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ..

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్రీడాకారులు ఫిర్యాదు చేశారు..రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ వారు పవన్ కలిసిన సందర్బంలో అవేదన వ్యక్తం చేశారు..రాష్ట్రంలో దారి తప్పిన క్రీడా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని, అలాగే క్రీడారంగంపైనా దృష్టి పెట్టాలని కోరారు.. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని పవన్ కల్యాణ్‌కు చెప్పారు.. ఏపీలో క్రీడలతో సంబంధం లేని వారి చేతికి సంఘాలను అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు.. క్రికెట్‌లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని ప్రముఖ క్రికెటర్ హనుమవిహారీ ఉపముఖ్యమంత్రి పవన్ కలిసిన సందర్బంగా కోరారు..అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘం అప్పగించాలని,, ఇదే పద్ధతి అన్ని సంఘాలకు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం అగ్రగామిగా నిలుస్తుందని క్రీడాకారులు తెలిపారు.. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని, క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు అంగడి సరకుగా మారాయంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తెలిపారు.. క్రీడానుభవం లేనివారు స్పోర్ట్స్ కోటాలో:- ఎలాంటి క్రీడానుభవం లేనివారు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. క్రీడా సంఘాల్లో తిష్టవేసిన రాజకీయ నాయకులు తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను ఎంపిక చేస్తున్నారని, క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని పవన్‌కు తెలియచేశారు..క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు క్రీడా సంఘాల్లో ప్రవేశం లేకుండా చూడాలని కోరారు. పవన్ కల్యాణ్ హామీ:- క్రీడాకారుల సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తగిన విధంగా న్యాయం చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు.. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని,,రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని భరోసా కల్పించారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా చూస్తామని, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన వైభవాన్ని తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

9 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

9 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.