Recent Posts

రేపు మధ్యహ్నం నుంచి సూర్యగ్రహణం

అమరావతి: ఈ సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం గురువారం మధ్యహ్నం ఏర్పడుతుంది..భారత్‌లో పాక్షికంగా కనిపించినప్పటికీ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపించనుంది..కెనడా, గ్రీన్‌లాండ్, రష్యా దేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుందని నాసా పేర్కొంది..ప్రపంపచంలోని ఇతర దేశాల ప్రజలు లైవ్ వెబ్‌క్యామ్ ద్వారా వీక్షించవచ్చు..సూర్య గ్రహణంను రక్షణ కల్పించే కళ్లద్దాలతో మాత్రమే చూడాలని సైంటిస్టులు తెలిపారు..సూర్య గ్రహణం భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.42కు మొదలై సాయంత్రం 6.41 గంటలకు ముగుస్తుందని శాస్త్రజ్ఞలు పేర్కొన్నారు.. 

Spread the love