Recent Posts

పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుని పడిన భారతదేశ ప్రతినిధి స్నేహ దూబే

అమరావతి: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్‌ అంసెంబ్లీ సమావేశంలో కశ్మీర్‌ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు..అలాగే ప్రపంచ దృష్టిని మరల్చేలా భారత్‌పై బురద జల్లే  ప్రయత్నం చేశారు..ఇందుకు భారతదేశ ప్రతినిధి స్నేహ దూబే పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.భారత్‌ ప్రతినిధి స్నేహ దూబే మాట్లాడుతూ” జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగమని, వాటిని ఎన్నటికీ భారత్‌ నుంచి విడదీయలేరంటూ ఘాటుగా స్పందించింది.. పాకిస్తాన్‌ చట్ట విరుద్ధంగా ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారతదేశానికి చెందిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయండి.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పాక్ ప్రధాని పనిలేనప్పుడుల్లా పొరుగు దేశమైన భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు.ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, స్వేచ్ఛగా తిరిగేలా పాస్‌పోర్ట్‌లు కూడా మంజూరు చేసిన గొప్ప దేశం అంటూ విమర్శించారు.ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి ఆర్థిక సహయం అందిస్తున్న చారిత్ర,, ప్రపంచ దేశాలకు తెలుసంటూ వ్యంగ్యగా వ్యాఖ్యనించారు..అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పోయింది..

Spread the love