Recent Posts

తెలుగు సాహిత్యంలోని పరిమళలను ఆస్వాదించేందుకు అనంత లోకాలకు సాగిపోయిన సిరివెన్నెల

హైదరాబాద్: తెలుగు సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని,ప్రేక్షకులు మనస్సులో నిలిచిపోయేలా అక్షరాలను పొందుపరిచే గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి,తన పాటల్లో భావలను వెతుకుంటు అనంత లోకాలకు సాగిపోయారు.. ఈ నెల 24వ తేదిన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో,సికింద్రబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.. అయను ఐసియులో వుంచి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోయింది.నేటి సాయంత్రం అయన తుది శ్వాస విడిచారు..సిరివెన్నెల ఇక లేరు అన్న వార్త రావడంతో చిత్రపరిశ్రమలో విషదం నెలకొంది.ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను అందించిన పద్మశ్రీ సిరివెన్నెల ఇక లేదరు అని తెలియడంతో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్రముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి లేని లోటు తీర్చలేనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు..ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా భాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మకు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,,ఏ.పి ముఖ్యమంత్రి జగన్,,టీడీపీ అధినేత చంద్రబాబు,, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!