Recent Posts

రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోన వైరస్ పాజిటివ్ కేసులు-వైద్యఆరోగ్యశాఖ

అమరావతి: రాష్ట్రంలోక‌రోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి..వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ మేరకు గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, కొత్త‌గా 4,549 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 59 మంది మృతిచెందారు..గత 24 గంట‌ల్లో 10,114 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..ఇప్పటి వరకు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,14,393 కు చేరుకుంది..నేటి వరకు 11,999 మంది మృతిచెందారు..రిక‌వ‌రీ కేసులు 17,22,381 కాగా ప్ర‌స్తుతం 80013 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

Spread the love