Recent Posts

వెబ్‌ సిరీస్‌ల పేరుతో పోర్న్‌కంటెంట్‌ తీస్తున్నశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

అమరావతి: మోడల్సే టార్గెట్‌గా వెబ్ సిరీస్‌ అవకాశాల పేరుతో అడల్ట్ పిక్చర్స్‌ తీస్తూ బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అడ్డంగా దొరికిపోయాడు.ప్రస్తుతం ఈ పోర్నోగ్రఫీ ఎపిసోడ్ బయటపడడంతో సోమవారం అర్థరాత్రి ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌తోపాటు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. వెబ్‌ సిరీస్‌ల పేరుతో పోర్న్‌, సెమీ పోర్న్‌ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ రాజ్ కుంద్రాపై అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో నిన్ననే విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.అంతేకాదు ఈ మొత్తం పోర్న్‌ మాఫియాకు రాజ్‌ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్‌ కమిషనర్‌ నిర్ధారించారు.

Spread the love