July 4, 2022

లడఖ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సైనికులు మృతి

అమరావతి: దేశ సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. ప్రమాదంలో గాయపడిన 19 మందిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.. మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు భారత సైన్యం పేర్కొంది.. భారత సైన్యం వర్గాలను ఉటంకిస్తూ ఓ న్యూస్ చానల్ తెలిపిన వివరాల ఇలా వున్నాయి..వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని విమానం ద్వారా వెస్టర్న్ కమాండ్‌కు తరలించేందుకు భారత వాయు సేన సహకారం కోరారని,,26 మంది సైనికులు పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టర్ ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తుంది..శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ నదిలో పడిపోయింది..అ ప్రాంతంలో నది లోతు దాదాపు 60 అడుగుల వరకు ఉంటుంది.. లద్దాఖ్​ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..జవాన్ల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందని,,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు..

Share
error: Content is protected !!