Recent Posts

12 మంది హైవే కిల్లర్ గ్యాంగ్ కు మరణశిక్ష విధిస్తు కోర్టు సంచలన తీర్పు

అమరావతి: జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను అటకాయించి డ్రైవర్లను కిరాతకంగా చంపివేసిన మున్నా గ్యాంగ్ కేసులో 12 మందికి కోర్టు మరణిశిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది..హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సుధీర్ఘ వాదనలు వినిన తరువాత సంచలన తీర్పు వెలువరించింది..ప్రధాన ముద్దాయి మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు ముఠాలోని మిగతా 11 మందికి కోర్టు మరణశిక్ష విధించింది..అలాగే ఈ కేసులో మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.. 13 ఏళ్ల క్రిందట హైవేపై వెళ్లుతున్న లారీలను అపి ఏడుగురు లారీ డ్రైవర్లను,, క్లీనర్లను ఈ గ్యాంగ్ హత్య చేసింది..మున్నా 13 హత్య కేసుల్లో నిందితుడు కాగా నాలుగు కేసుల్లో నేరం రుజువైందని ఒంగోలు కోర్టు స్పష్టం చేసింది..లారీ డ్రైవర్లను, క్లీనర్లను దారుణంగా హత్య చేసి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారగా ఇప్పటికీ ఎంతో మంది డ్రైవర్ల మిస్సింగ్ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి..ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఇస్లామ పేటలో నివాసం వుంటున్న మున్నాకి వివాహంమైంది..ముగ్గురు సంతానం. 2012 అక్టోబర్‌లో ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం జీవనం సాగించాడు..హైదరాబాద్,, బెంగుళూరు,,వైజాగ్,,ఒంగోలులో వ్యాపారాల పేరుతో ప్రజలను భారీ ఎత్తున మోసం చేసి అక్కడి నుంచి మకాం మార్చాడు..ఇతనిపై పలు కిడ్నాప్ కేసులు,,చోరీ కేసులు నమోదైవున్నాయి..అయితే ఈ గ్యాంగ్ హైవేలపై లారీలను ఆపి డ్రైవర్లను, క్లీనర్లను అంతమొందించడం వీరి అసలు నేరప్రవృత్తి..కర్ణాటకలోని మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్ లో అరెస్టు చేసి ఒంగోలుకు తరలించగా నేడు ఈ కేసులో శిక్ష పడింది..

Spread the love