Recent Posts

ఈనెల 21,22 తేదిల్లో స్పోర్ట్సు స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు-సి.ఇ.ఓ పుల్లయ్య

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా కడపజిల్లా పుట్లంపల్లిలో వున్న స్పోర్ట్సు స్కూల్ లో 4,5వ తరగతిలో ప్రవేశానికి జిల్లా స్థాయిలో బాల,బాలికల ఎంపికలు ఈ నెల 21,22 తేదిల్లో ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా సెట్నల్,క్రీడా ప్రాధికార సంస్థ సి.ఇ.ఓ డి.పుల్లయ్య తెలిపారు.జిల్లా స్థాయిలో ఎంపికకాబడిన బాల,బాలికలు 27,28వ తేదిల్లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ,గుంటూరులో జరుగబోవు రాష్ట్ర స్థాయి స్పోర్ట్సు స్కూలు ఎంపికల్లో పాల్గొనాల్సి వుంటుందన్నారు.రాష్ట్ర స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్దిని,విద్యార్దులను 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న స్పోర్ట్సు స్కూలులో చేర్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో మంచి పౌష్టికాహారం,బస,నిష్ణ్నాతులైన క్రీడా శిక్షకులచే,అకాడమీకి చదువులతో కూడిన సదుపాయలను అందచేసి మంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు సహకరిస్తుందన్నారు.ఎంపికల కోసం నిర్వహించబోయే బ్యాటరీ పరిక్షలు:-1.బరువు,,2.ఎత్తు,,3.30 మీ.ఫ్లైయింగ్ స్టార్ట్,,4.స్టాండింగ్ బ్రాడ్ జంప్,,5.6X10 షటిల్ రన్,,6.ప్లెక్సిబిలిటి,,7.స్టాండింగ్ వర్టికల్ జంప్,,8.మెడిసిన్ బాల్ పట్,,9.800 రన్నింగ్ లు వుంటాయన్నారు..ఇతర వివరాల కోసం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ,నెల్లూరు ఫోన్ నెంబర్లు: 9849909074,,,9121106835ను కార్యాలయం పనివేళల్లో సంప్రదించగలరు..

Spread the love
error: Content is protected !!