Recent Posts

రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం-విద్యాశాఖ మంత్రి సురేష్

అమరావతి: రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో బుధవారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు..ఈ నెల 12 నుంచే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించనున్నారు..విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న ‘నాడు–నేడు’ పనులన్నింటినీ ఆగస్టులోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు..నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలన్నారు..పాఠశాల్లో విద్యార్దులకు మంచి విద్యను అందించేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు..ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్నిఅమలు చేస్తోందన్నారు..ఈ విధానంలో ఏ ఒక్క ఉపాధ్యాయుడి పోస్టూ తక్కువ కాదని,,ఏ పాఠశాల మూతపడదన్నారు..ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీచర్లకు వర్క్ బుక్స్ పై శిక్షణనిస్తామన్నారు..ఫౌండేషన్ స్కూళ్లకు రెండేళ్లలో అదనపు గదులను నిర్మించి ఇస్తామని తెలిపారు..ఇంటర్ ఫస్టియర్ మార్కులు 70 శాతం,,పదో తరగతి మార్కులు 30 శాతం కలిపి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులను వేస్తామని,,ఈ నెలాఖరు లోపు మెమోలను విడుదల చేస్తామని తెలిపారు..

Spread the love