Recent Posts

ఆగష్టు 16న స్కూల్స్‌ రీ ఓపెన్-టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి-సీఎం జగన్

అమరావతి: 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి,అలాగే  ఆగస్టు 16న స్కూల్స్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ,వ్యాక్సినేషన్‌,,వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం సమీక్ష నిర్వహించిన సందర్బంలో మాట్లాడుతూ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని,ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాన్నారు.పెళ్లిళ్ల సీజన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయని, కోవిడ్‌ వ్యాప్తికి దారితీసే అవకాశాలున్నాయని,పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాలని, పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు.కోవిడ్‌ నివారణా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని,ఇదే సమయంలో ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ గుమిగూడకుండా చర్యలు తీసుకొవాన్నారు.అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలన్నారు.ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలని,దీనివల్ల పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయన్న సీఎం, ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు.

Spread the love