Recent Posts

బ్యాంకుల విలీనంతో దేశ ఆర్థిక ప్రగతిలో ఎస్బిఐ కీలక పాత్ర పోషిస్తుంది-కలెక్టర్

నెల్లూరు:  జిల్లాలోని నిరుపేదల పై దృష్టి సారించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి ఎన్ చక్రధర్ బాబు బ్యాంకర్లను కోరారు..గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి స్కూల్ కాంపౌండ్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ కల్యాణ మండపంలో భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రుణ మేళను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు దశల కోవిడ్ అన్ని రంగాలను దెబ్బతీసిందని, మరల పుంజుకోవడానికి సమయం ఆసన్నమైందన్నారు..దేశంలోని బ్యాంకులు, ప్రైవేటు,  రియల్ ఎస్టేట్ తదితర ఆర్థిక రంగాలు ప్రస్తుతం ముందుకు సాగడానికి కృషి చేస్తున్నాయన్నారు..లాక్ డౌన్  నుంచి బయటపడ్డాక అన్ని రంగాలు ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయన్నారు.బ్యాంకుల విలీనంతో ఆర్థిక ప్రగతిలో ఎస్బిఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  ఎస్బిఐ  ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరు ప్రఖ్యాతులు సాధించిందని,  రానున్న రోజుల్లో మరెన్నో లక్ష్యాలను సాధించాలని కోరారు..ఇటువంటి  రుణ మేళాల ద్వారా సామాన్య మానవునికి మరింత దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలలో భాగంగా బ్యాంకులు నిరుపేదల పై దృష్టి సారించి వారి ఆర్థిక ప్రగతికి దోహద పడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.  ఇటీవల పెద్ద నగరాలైన చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవ,  వైజాగ్- చెన్నై పారిశ్రామిక నడవ, పలు పారిశ్రామిక పార్కులు మంజూరు కావడంతో జిల్లా ముఖచిత్రం మారిపోనుందన్నారు.  జిల్లాలో రానున్న రోజుల్లో 400 ఎం ఎస్ ఎం పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృషి జరుగుతోందని,  తద్వారా ఆర్థిక ప్రగతి తో పాటు చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ మేళ 9వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయం సహాయక సంఘాలు మహిళలు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలను సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ డి జి యం ఆర్ వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు..

Spread the love
error: Content is protected !!