Recent Posts

సర్కారు వారి పాట సాగిపోతుందా ?

రివ్యూ…

హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలు చాలా మంది బ్యాంకుల్లో అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..ఇదే సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలు బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని,,ఎగనామం పెట్టి,, సమాజంలో పెద్దమనుషుల్ల యధేచ్ఛగా తిరుగుతున్నారు..అలాంటి కర్పొరేట్ వ్యాపారస్తుల ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురాం తెరకెక్కించాడు..ప్రస్తుతం సమాజంలో ఇలాంటి పోకడ సర్వసాధరణం అయిపొయింది..ఇలాంటి కథను ఎంచుకుని,,దానికి కమర్షియల్‌ హంగులను జతపర్చి యువతను ఆక్షర్షించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పరుశురాం.. సినిమాలో హీరో తీసుకున్న పాయింట్‌ కూడా నిజాయితీగా ఉంటుంది..అయితే కథను నడిపించడంలో లాజిక్‌ మిస్‌ అవుతుంది..కమర్షియల్‌ సినిమాలు అంటే కొంత అభూత కల్పన వుంటుంది కాబట్టి,,ప్రేక్షకుడికి అంతగా ఎబ్బేటుగా వుండదు..మొదటి భాగం కామెడీగా సాగుతుంది.. వెన్నెల కిశోర్‌పై మహేశ్‌ వేసే పంచ్ లు,, కళావతితో లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులను 1.15 నిమిషాలు నడిపిస్తాయి.. అయితే కేవలం 10 వేల డాలర్ల కోసం హీరో అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏమిటి అనే సందేహం ప్రేక్షకుడికి కలుగుతుంది?? ఇక ఇంటర్ వెల్ తరువాత సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది..ఇక్కడి నుంచి కథ కాస్త సీరియస్‌ సాగుతుంది..మహేశ్‌ వేసే పంచ్‌ డైలాగులు ఒక ప్రక్క సాగుతూంటే,మరో ప్రక్క నుంచి కామెడీని పండించేందుకు దర్శకుడు ప్రయత్నించినప్పటికి,అది పెద్దగా అకట్టుకోలేదు..బ్యాంకుల లోన్స్ ఇచ్చే సమయంలో అనుసరించే పద్దతుల గురించి మహేష్ చెప్పే డైలాగ్స్‌ సగటు ప్రక్షకుడిని ఆలోచింపజేస్తాయి..ఏతావతా తెలింది..కథశంకు తగ్గట్టుగా సినిమాను నరేట్ చేయడంలో దర్శకుడు తడబడినట్లు అర్ధం అవుతుంది..చివరిగా సర్కారి వారి పాట ఒరకంగా సాగిపోతుంది..?

నటీనటులు: మహేష్ బాబు కీర్తి సురేష్, సముతిరఖని, నదియా, సౌమ్య మీనన్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: ఆర్ మధి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకత్వం: పరశురామ్ బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్..

Spread the love
error: Content is protected !!