Recent Posts

శరత్ కుమార్,రాధికలకు సంవత్సరం జైలు శిక్ష

అమరావతి: ప్రముఖ తమిళ నటులు,,దంపతులు శరత్ కుమార్,,రాధికలకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లోచర్చనీయంశంగా మారింది.. 2014లో మ్యాజిక్ ప్రేమ్స్ సంస్థ ఓ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేసి,,ఈ సినిమాకు మ్యాజిక్ అని పేరు పెట్టారు..ఇందులో విక్రమ్ ప్రభు,, కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటింప చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది..మ్యాజిక్ ప్రేమ్స్ సంస్థలో శరత్,,రాధికలు భాగస్వాములుగా ఉన్నారు..ఈ సినిమా నిర్మాణం కోసం రూ.1.5 కోట్లను రేడియంట్ మీడియా సంస్థ నుంచి అప్పుగా తీసుకున్న వీరు 2015 మార్చి నెలలో అప్పును తిరిగి ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు..అనుకున్న సమయానికి అప్పు చెల్లించక పోవడంతో సదరు సంస్థ ఒత్తిడి పెంచింది..దింతో రాధికా,,శరత్ కుమార్ లు చెక్కు ఇచ్చారు..2107లో వారు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ వారిపై కేసు పెట్టింది..ఈ కేసును చెన్నై స్పెషల్ కోర్టు విచారించి (నేడు) బుధవారం రాధికా,, శరత్ కుమార్ లకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది..

Spread the love