Recent Posts

వాట్సప్ యాప్ కు ధీటుగా సందేశ్ యాప్-కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

అమరావతి: వాట్సప్ యాప్ కు ధీటుగా,నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ డెవ‌ల‌ప్ చేసిన‌“సందేశ్” యాప్ సుర‌క్షిత‌మైంద‌ని, వ‌న్ టు వ‌న్ మెసేజ్‌, గ్రూప్ మెసేజ్‌, ఫైల్‌, మీడియా షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్,ఈ గ‌వ‌ర్న‌మెంట్ అప్లికేష‌న్స్ అన్నింటిని ఈ యాప్ ద్వారా పొంద‌వ‌చ్చని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ లోక్‌స‌భ‌లో వివ‌రించారు.ఈ యాప్ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులో ఉంద‌న్నారు.కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఏజెన్సీలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు యాక్సెస్ ఉండేదని, ప్రస్తుతం అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టు మంత్రి తెలిపారు.మొబైల్ నెంబ‌ర్ ను న‌మోదు చేయ‌డం ద్వారా వ‌చ్చిన ఓటీపీ వెరిఫికేష‌న్‌తో ఈ యాప్‌ను వినియోగించుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.  

Spread the love