Recent Posts

స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం చార్జీల బదుడుకు సిద్దమౌవుతున్నRTC

హైదరాబాద్: కరోనా కష్టకాలం తరువాత వస్తున్న దసరా పండుగలకు నగరంలో నివసించిన అన్ని వర్గాల ప్రజలు సొంత ఉర్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుకుంటున్న సమయంలో,,గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన నష్టలను కొద్దిగా అయిన పూడ్చుకునేందుకు APSRTC తన ప్రయత్నాలు ప్రారంబించింది.. స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం ఛార్జీలను పెంచి వేసింది..?ప్రయాణికులకు సేవాలు అందించాలన్న లక్ష్యంతో APSRTC దూర ప్రాంతాలకు బస్సులు నడిపిస్తుంది..అయితే ఈ బస్సు సగం వరకు ఖాళీగా వెళ్తుతున్నాయి..దీంతో దసరా సెలవులకు సొంత ఉర్లకు వెళ్లె సామాన్యుడిపై బస్సు టీకెట్ల భారం పడనున్నది..ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా దసరా పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారికి, విజయవాడ దుర్గమ్మ దర్శనం అందరికీ అందేలా చేసేందుకు ప్రత్యేకంగా APSRTC రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది.. అయితే ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు..కరోనా కష్టకాలంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఛార్జీలు పెంచడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..ఇందుకు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తు,,కేవలం స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు..ఇతర రాష్ట్రల నుంచి నడుపుతున్న బస్సులు ఖాళీగా వెళ్తుందని కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం పెంచుతున్నామని వెల్లడించారు..ఏది ఏమైన బస్సుల చార్జీలు పెంచడం అంటే మద్యతరగతి ప్రజలకు ఒక రకంగా పెను భారమే..ఇక ప్రవేట్ బస్సుల ఆపరేటర్లు నిర్ణయించే చార్జీలు వుహించడానికి కూడా సాధ్యం కాదేమో ?

Spread the love