Recent Posts

కోచి తీర ప్రాంతంలోని 3వేల కోట్ల రుపాయల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం

అమరావతి: డ్రగ్స్ మాఫీయా రెచ్చిపోతుంది..భారతదేశంలోకి వేల కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్దాలను స్మగ్లింగ్ చేస్తుంది..ఈనేపథ్యంలో సోమవారం కేరళ రాష్టంలోని కోచి తీర ప్రాంతంలోని ఓ ఫిషింగ్ బోటు నుంచి భారత నేవీ అధికారులు 300  kg డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు..అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.3000 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.. అరేబియా సముద్రంలో భారత నౌక సువర్ణ గస్తీ కాస్తుండగా ఓ చేపల బోటు అనుమానాస్పందంగా కనిపించింది. దీంతో అందులో సోదాలు జరపగా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు బయటపడ్డాయన్నారు.. బోటును,,అందులోని 5గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని,, తదుపరి విచారణ నిమిత్తం వారిని కొచ్చి పోస్టుకు తరలించారు..ఈ స్థాయిలో నార్కోటిక్స్ పట్టుబడడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు..

Spread the love