Recent Posts

ప్రభుత్వ మద్యం దుకాణల్లో రూ.33 లక్షలు నొక్కేశారు !

విశాఖపట్నం: అవకాశం దొరికితే దేనిని అయిన అమ్మేసి సొమ్ముచేసుకునేందుకు అవినితి పరులు సిద్దంగా వుంటారు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపుల్లో అవకతవకలు మొదలై చాలా నెలలు గడుస్తున్నాయి..సీ.ఎం సద్దుదేశంతో చదువుకున్న యువతకు ఉపాధి కల్పనతో పాటు మద్య నియంత్రణ చర్యల్లో బాగంగా ప్రభుత్వం దుకాణలను ఏర్పాటు చేసింది..వేల మంది యువతకు ఉపాధి దొరికింది..నెలవారీ జీతం తీసుకుంటున్నప్పటికి,,వీరికి నెల జీతం సరిపోతున్నట్లు లేదు ?. దింతో బ్రాండెడ్ మద్యంను పక్కదారిలో అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నరన్న ఆరోపణలు వెల్లువెత్తాయి..ఇదే సమయంలో విశాఖ సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో మొత్తం 33లక్షల రూపాయలు నగదు సిబ్బంది పక్కదారిపట్టించినట్లు సమాచారం..ఇందులో బాధ్యులైన సిఐ శ్రీనివాస్ ను విధుల నుంచి తప్పించి,,ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు ఉన్నతధికారులు ఆదేశించారు.. ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు అదేశాలతో జిల్లాలోని మద్యం దుకాణల్లో  స్పెషల్ డ్రైవ్ చేపట్టి,,సూపర్ వైజర్లు, వైన్ షాప్ సిబ్బంది ని విచారిస్తున్నారు..మరో 12 మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చారు..నిధులు రికవరీ తర్వాత క్రిమినల్ కేసులు పెడతమని అధికారులు పేర్కొన్నారు..

Spread the love