Recent Posts

పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన రూ.3 కోట్ల నగదు-ఎస్పీ

కర్నూలు: రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.3 కోట్ల రూపాయల నగదుతో పాటు రూ.55 లక్షల విలువైన బంగారం పట్టుబడిందని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు..శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజు వారీ చెకింగ్ లో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో చేతన్ కుమార్ అనే ప్రయాణికుడికి సంబంధించిన రెండు బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు..అందులో భారీగా నగదును గుర్తించారు..అయితే ఈ నగదులకు  సంబంధించి ఆ వ్యక్తి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు..అలాగే హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని పీఎంజె జ్యువెల్లరీకి చెందిన 55 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు..బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో కర్నూలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు..బ్యాగుల్లో దొరికిన డబ్బు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీకి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.. ట్రావెల్ డ్రైవర్‌గా పనిచేసే చేతన్ కుమార్,, ఈ నగదును బెంగళూరు తరలించి అక్కడ్నుంచి చెన్నైకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నడని తెలిపారు. దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని చెప్పారు..

Spread the love