Recent Posts

టీఆర్ఎస్ పార్టీ,ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా-ఈటల

హైదరాబాద్: టీఆర్ఎస్ బ‌హిష్కృత నేత,,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు..శుక్రవారం హైద‌రాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు..ఉరిశిక్ష‌ప‌డిన ఖైదీకి కూడా చివ‌రి కోరిక ఏంట‌ని అడుగుతార‌ని,,అయితే ఏం జ‌రిగిందో తెలుసుకోకుండా తనపై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, రాత్రికి రాత్రే విచార‌ణ చేసి మంత్రి పదవీ నుంచి బ‌ర్త్‌ ర‌ఫ్ చేశార‌ని ఈట‌ల ఆరోపించారు..19 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో పనిచేస్తున్నని,, ఓ అనామ‌కుడు లేఖ‌రాస్తే రాత్రికి రాత్రే మంత్రిమీద విచార‌ణ చేస్తారా అని ప్ర‌శ్నించారు.. త‌న‌పై జ‌రుగుతున్న దాడి, కుట్ర‌లపై ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నార‌ని ఈట‌ల చెప్పారు.. హుజూరాబాద్‌లో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా పార్టీని గెలిపించుకున్నామ‌ని, డ‌బ్బులు, కుట్ర‌ల‌తో కాదని అన్నారు..కేసీఆర్‌ను క‌లిసేందుకు రెండుసార్లు ప్ర‌య‌త్నించన‌ని,,అయితే తనకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఈట‌ల చెప్పారు..  

Spread the love