Recent Posts

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి-జెసి

నెల్లూరు: ఈనెల 26వ తేదీన నెల్లూరు నగరంలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరెందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై  జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతిభ కనపరిచిన వారి ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసేందుకు వీలుగా వారి పేర్లను ముందుగా ప్రతిపాదించి పంపాలని ఇందుకోసం ముఖ్యంగా గృహ నిర్మాణం అమలులో చూపిన చొరవను పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ అధికారి వారి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ పెరేడ్  మైదానంలో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు హాజరు కావాలన్నారు.  గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కోవిడ్ నిబంధనలను విధిగా పాటిస్తూ పోలీస్ పెరేడ్ మైదానంలో వేదిక ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే సాయంత్రం శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం నిర్వహించే రెండు చోట్ల ప్రథమ చికిత్స చేసే విధంగా వైద్య శిబిరాలు  ఏర్పాటుచేసి అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. విద్యా సంస్థల నుండి విద్యార్థులు వేడుకలు జరిగే ప్రదేశానికి చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించే విధంగా ప్రభుత్వ శాఖల ప్రదర్శనశాలలు, శకటాలు ఏర్పాటు చేయాలన్నారు.

Spread the love
error: Content is protected !!