Recent Posts

రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ వాయిదా

అమరావతి: రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ వాయిదా పడింది.వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న భారత మార్కెట్లో Jio Phone Next ఫోన్ లాంచ్ చేస్తామని అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు..ఈ 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ దీపావళికి లాంచ్ చేసేందుకు జియో, గూగుల్ సంస్థలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా Jio Phone Next అద్భుతమైన ఫీచర్లతో వస్తోందంటూ ప్రచారం జరిగింది.ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో “చిప్ సెట్” కొరత తీవ్రంగా వుండడంతో మార్కెట్లోకి Jio Phone Next ఫోన్ రిలీజ్ చేయడం సరైన సమయం కాదని గూగుల్, జియో సంస్థలు భావించాయి.దాంతో వచ్చే దీపావళికి ఈ ఫోన్ లాంచ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది..

Spread the love